Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
దేవుని ఫ్రెండ్స్
#1
ప్రియమైన చిన్న బిడ్డలారా...

మీరంటే యేసయ్యకు ఎంతో ఇష్టం. “చిన్న బిడ్డలని నా యొద్దకు రానియ్యుడి దేవుని రాజ్యం వారిదే” అన్నారు యేసయ్య మీకందరికి మీ స్నేహితులంటే ఇష్టమా ?..చాలా ఇష్టమా..?
మరి మనము దేవుని ఫ్రెండ్స్ ఎవరో చూద్దామా !

అబ్రహాము: అబ్రహాము అతని భార్య శారా ఒక దేశములో నివసించేవారు. ఆ దేశములో అందరు దేవునికి అవిధేయులై ఉండేవారు. ఒక రోజున దేవుడు అబ్రహాముతో, ఆ దేశము వదిలి నేను చూపించిన దేశమునకు వెళ్ళు అని చెప్పారు. అబ్రహాముకిదేవుడంటే చాల ఇష్టం. ఏమి అడగకుండా దేవునికి విధేయత చూపించి, ఆ దేశాన్ని వదిలి దేవుడు చూపించిన దేశముకి తన భార్యయైన శారాను, లోతును మరియు ఆయన పరిచారకులను తీసుకొని బయలుదేరారు. అప్పుడు అబ్రహాముకి 75 సంవత్సరాలు.
అబ్రహాముకి బిడ్డలు లేరు.

అబ్రహాము 25 సంవత్సరాలు ప్రయాణించి, దేవుడు చూపించిన ఆ కొత్త దేశమునకు వెళ్లారు. ఆ దేశం ఎంతో అందంగా ఉంది. అబ్రహమునకు ఎంతో సంతోషంగా ఉన్నది ఆ దేశమును చూసాక. అబ్రహాము అతని భార్య శారా ఒక గుడారములో ఉండేవారు. ఒక రోజు, కొంత మంది మనుషులు అబ్రహాము దగ్గరకి వచ్చారు. వీరెవరో అబ్రహాముకి తెలియదు. వారు దేవునిదూతలు. అబ్రహామునకు వారెవరో తెలియకపోయినా వారికి ఆతిధ్యమిచ్చి వారిని ఎంతో బాగా చూసుకున్నారు. వారు అబ్రహామును శారాను చూచి దేవుడు మీకు మంచి బాబును ఇస్తాడు అని దీవిస్తారు. అప్పుడు అబ్రహామునకు 100 సంవత్సరాలు అయినప్పటికీ అబ్రహాము ఆ మనుష్యులు చెప్పింది నమ్మాడు. అబ్రహాము శారాలకు దేవుడు ఎంతో మంచి బాబును అనుగ్రహించారు. అతని పేరు ఇస్సాకు. అబ్రహాము దేవునికి ఎంతోమంచి స్నేహితుడు. దేవునికి ఎప్పుడు వినయ విధేయతలతో ఉండేవారు. అందుకే దేవుడు వారినిఎంతగానో ఆశీర్వదించాడు. మరి మీరుకుడా స్నేహితులవుతారా?.

మనమందరమూ దేవుని బిడ్డలము. దేవుడు మనలను ఎంతో ప్రేమించారు. దేవుడు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తారు. మనము ఆయనకు అబ్రహామువలె విధేయత చూపించాలి.
Reply


Forum Jump:


Users browsing this thread: 1 Guest(s)